పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహర్షి దేవేంద్రనాధకాకూర్ స్వీయ చరిత్రము

124




వియే ఆదేశములు, ఇవియే ఉప దేశములు, ఇవియే శాస్త్రములు, ఈ ప్రకారముగా నీవాతని నుపాసింపుము. ఈ ప్రకారముగా నీవాతని ను పాసింపుము!


సంయుతులై , శుచులై , ఈ పవిత్ర బాహ్మధర్మము చదువు వారికిని వినువారికిని, మరియు బ్రహ్మపరాయణులై తదనుసారముగ ధర్మానుష్టానము చేయువారికిని అనంత ఫలము లభించును.

ఇరువది నాల్గవ ప్రకరణము,


ఈరీతిగా 1848 వ సంవత్సరములో బాహ్మధర్మము గ్రంధరూపమున వెలువడెను. దీనిలో నద్వైతవాదము, అవతార వాదము,మాయావాదము నిరసింపబడెను. 'పరమాత్మయు, జీవాత్మయు పరస్పర సఖులనియు, సర్వదా కలసియుందురనియు, బ్రాహ్మధర్మగ్రంధమువ్రాయబడియున్నది. “ ద్వాసుపర్ణా సయుజా సఖాయా. " దీనిలో నద్వైత వాదము నిర సింపబడినది. బాహ్మధర్మములో “నవభువక" అని ఉండెను. . అతడు మానవుడు కాడు, ఈజడజగత్తు కాదు, తరులతలు కాదు. దీనిలో అవతార వాదము నిరసింపబడెను. బ్రాహ్మధర్మమునందు

"సతపోస్త స్వాయత సత పస్తస్త్వా ఇదం సర్వమసృజత యదిదంకించ» _ 

ఆయన ఆలోచన చేసెను. ఆలోచనచేసి ఈ అన్నిటిని సృష్టి చేసెను—


పూర్ణ సత్యము నుండి విశ్వసంసారము నిస్సృతమయ్యెను. ఈ విశ్వసంసారము అపేక్షక సత్యము. దీని సృష్ట యెవ్వడో అతడు సత్య ముయొక్క పూర్ణ సత్యము. ఈవిశ్వ సంసారము స్వప్న వ్యాపారము కాదు. ఇది మానసిక భ్రమకాదు. ఇది వాస్తవిక సత్యము. ఏ సత్యము