పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

మహర్షి దేవేంద్రనాథఠాకూర్ స్వీయచరిత్రము,




హే ! పరిపూర్ణజ్ఞానముయా ! నిత్యనూతనమై, శుభ్రజ్యోతిర్మయ మైన నీసత్యము నాచిత్తాకాశమందు ఎప్పుడు ప్రకాశితమగును?


ఉర్ధ్వముఖముతో, జోడితహస్తములతో, నవ సౌఖ్యము, నవప్రాణము, నవారుణోదయముల కొరకు దీర్ఘ నిశీయుతయు ఉదయదిశ వంక చూచుచు కూర్చుండి యున్నాడను. ఏమిచూతునో ? ఏమి తెలిసి కొందునో? ఆ రానున్న యానంద మేదియో తెలియదు.


నాహృదయాంతరాళమున నొకనూతన కాంతి. ఆ కాంతి సహాయముతో, అత్యం తానందముతో గీతముల పాడుకొనుచు నింటికి పోవుదును.

దుర్భరమగు పరవాసజీవనము గడపుచునుండ నేవరిచ్చగింతురు! –


ఈ సమయమునందీ యాశీర్వచనము నాహృదయములో ప్రవేశించెను. “స్వ స్త్రీవః పారాయతమసః పరస్తాత్" ఈయజ్ఞానాంధ కారసంసారము యొక్క పరకూలమున బ్రహ్మలోకమునకు పోవుమార్గము నీకు నిర్విఘ్నమగుగాక ! ఈఆశీర్వచనము పొంది ఈపృధివిలో నుండిశాశ్వత బ్రహ్మలోకము ననుభవింపగలుగుదును.

ఇరువదిమూడవ ప్రకరణము.


బాహ్మసమాజికులకందరకు ఏక స్థానమేది ? ఇదియే ఇప్పుడు నాఆలోచన. తంతము, పురాణము, వేదము, వేదాంతము, ఉపనిష త్తులు, ఇవేవియునుకూడ బ్రాహ్ములకు ఏక స్థానము కాని, బ్రాహ్మధర్మమునకు పునాదిగాని యొసగజాలక పోయెను. బ్రాహ్మధర్మమున కొక బీజమంతము (Creed) ఉంవ లెననియు ఆబీజమంత్రము బాహ్ములకందరకు ఏక స్థానమగుననియు నిశ్చయించికొంటిని,