పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది రెండవ ప్రకరణము.

115




ర్ణమై, అంతరతమామృత బ్రహ్మము యొక్క తిమిరాతీత జ్ఞానోజ్ఞ్యల ప్రేమసి క్రోడమునందు నివాసముగాంచును. అక్కడ నూతన ప్రాణమునొంది, పవిత్రమై, ఆయన కృపవల్ల జ్ఞానమునందును, ప్రేమయందును, ఆనందమునందును, ఆ అనంతజ్ఞాన ప్రేమానందములతో ఛాయాతపములవలె నిత్యయుక్తమై యుండును. ఆదినమున కింక అవసాన ముండదు.* సకృత్విభాత్వేవైష బాహ్మలోక " ఇదియే దాని పరమగతి. ఇది యేదాని పరమసంపద. ఇదియే దాని పరమలోకము. ఇదియే దాని పరమానందము,"ఏషాస్యపరమాగతి రేషాస్య పరమా సంపదే షాస్య పరమోలోక ఏషోస్య పరమానందః పరమామాగతి రేషా స్య పరమాసంపదే పాస్య పరమోలోక ఏషోస్య పరమానందః”


వేదముయొక్క ఈమహావాక్యముతో జ్ఞానము తృప్తి చెందును.ఆత్మ శాంతి లాభము చెందును. హృదయము ఆనందముతో పరిపూర్ణమై


“బ్రహ్మా భయం వై బ్రహ్మభయం” - బ్రహ్మను పొందుటవలనఎంతటి నిర్భయముగా" ననగును "అని నిరంతరము వచించు చుండును.


" పరిపూర్ణజ్ఞానమయ
నిత్యనవసత్యతవశుభ్ర ఆలోకమయ
కబేహ బేవి భాసిత మమచిత్తఆకాశే|
రోయాచి బొషి దీర్ఘ నిశిచాయియీఉదయదిశి|
ఊర్ధ్వముఖేకరపుటే నవసుఖ, నవప్రాణ, నవదివాఆశే!
కిదేఖబొ, జానిబో, నాజాని షేకి ఆనంద!
నూతనఆలోక అపన్ మనమాయే|
షేఆలోకే మహాసుఖే ఆపన్ ఆలయముఖే|
చొలేజా బాగాన్ గాయి, కే రొయిఛే ఆర్ దూరపరవాసే!

  • బ్రహ్మ సంగీత్ "