పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

మహర్షి దేవేంద్రనాధశాకూర్ స్వీయచరిత్రము.



ఆదివ్య పథము యొక్క , పుణ్య పథముయొక్క, యాత్రికుడై అగణ్య స్వర్గ లోకములనుండి స్వర్గలోకములకు ఉన్నతి చెందు చుండును. ఈశ్వర ప్రసాదమువల్ల ఆత్మ ఉన్నతశీలమగును. పాపతాపముల నతిక్రమించి యున్నత శీలాత్మకు ఔన్నత్యము లభించును. పృధివిలోకింక నతకు అధఃపతనము జెందడు. ఈశ్వరుని మంగళ రాజ్యము నందు పాపమెప్పుడు జయము పొందదు. ఆత్మ యొక్క ప్రధమ జననము మానవ శరీరమందు. మరణానంతరమున తన పాపపుణ్యముల ఫలభోగము నిమిత్తము ఉపయుక్త శరీరధారణ గావించి లోకలోకాంతరములందు సంచారము చేయు చుండును. ఇచ్చటకు మాత్రము తనకు పునరాగమనముండదు.


భ్రహ్మోపాసన యొక్క ఫలము నిర్యాణముక్తియని ఉపనిషత్తులలోనే గాంచినపుడు నాయాత్మ భయము చెందెను. “కర్మాణి విజ్ఞానమయచ్చ ఆత్మాపరేవ్యయే సర్వఏకీ భవంతి ". సకలకర్మలు, విజ్ఞానమయాత్మ, అవ్యయబ్రహ్మ, సకలము ఏకమగును.”విజ్ఞానమయాత్మకు ప్రత్యేక సంజ్ఞ ఉండదని దీని అర్ధమైనచో అదిముక్తి యొక్క లక్షణముగాదు. భయానక ప్రళయము యొక్క లక్షణము బాహ్మధర్మము నందలి ఆత్మ యొక్క అనంతౌన్నత్య మెక్కడ! ఈనిర్వాణముక్తి యొక్కడ! ఉపనిషత్తులలోని యీనిర్వాణ ముక్తికి నాహృదయమునందు స్థానము దొరక లేదు. ఈ విజ్ఞానమయాత్మ ఉన్నత స్వర్గముము నందుండును గాక,లేక అథః పృధివియందుండుగాక ! ఎప్పుడు తనసమస్త విషయవాంఛల పరిసమాప్తిని చెంది అంతర్యామియైన పరమాత్మను పొందవలెనన్నకోరిక ఒక్కటే మాత్రము హృదయమునందు జ్వలించుచుండునో,ఎప్పుడు ఆశారహితమై ఈశ్వర సాంగత్యము మాత్రము కోరుచుండి నిరంతరము ఈశ్వరాజ్ఞులు శిరసావహించుచుండి, సహిష్ణుత కలిగి ఈశ్వరాధిష్ట ధర్మకార్యముల సాధన చేయుచుండునో, అప్పుడు ఆదేహ బంధనల నుండి విముక్తి చెంది, సంసార పారావారము.నుండి ఉత్తీ.