పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది మూడవ ప్రకరణము.

117



ఇట్లు తలంచి ఈశ్వరునకు నాహృదయము "వెల్లడి చేసి యిట్లంటిని, “నాహృదయమును నీవు వెలుగొందింపుము. ” ఆయనకృపచే నా హృదయము తకుణమే దీప్తమయ్యెను. ఈ కాంతి సహాయమున బ్రాహ్మధర్మమున కొకబీజము కాంచగల్గితిని. దానిని వెంటనే నాసమ్ముఖమున పడియున్న ఒక కాగితపుముక్క-పై ఒక పెన్సిల్ తో లిఖియించి యీ కాగితము నొక పెట్టెలో పెట్టి తాళము వేసితిని. అది 1848వసంవత్సరము. నాకప్పుడు 81 వ సంవత్సరము. ఆబ్రాహ్మధర్మ బీజము ఈరీతిగా పెట్టెలో పడియుండెను.


పిమ్మట బ్రాహ్ములకొక ధర్మగ్రంధ ముండవ లెననుకొంటిని.వెంటనే అక్షయకుమారదత్తుని పిలచి, “నీవు కాగితము కలము తెచ్చికూర్చుండుము; నేను చెప్పినదంతయు వ్రాయుచుండుము” అని చెప్పితిని. అప్పుడు నేనేకాగ్రచిత్తుడనై నాహృదయమును పూర్తిగా విప్పి యీశ్వరుని యెదుట పెట్టితిని, ఆయన ప్రసాదమువల్ల నాహృదయముసందు ద్భాసితమైన సకలాధ్యాత్మిక సత్యముల నుపనిషత్తుల ముఖమునుండి నదీప్రవాహమువలె "నేను సహజముగను, సతేజముగ నుచ్చరింప నారంభించితిని. అక్షయకుమారుడు వానిని వెంటనే వ్రాయనారంభించెను. 'నేను సతేజముగా బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మ వాదులు చెప్పుచున్నారు అంటిని. బ్రహ్మవాదులు ఏమి చెప్పుచున్నారు? "యతో వాఇమాని భూతానిజాయంతే, యేనజాతానిజీవస్తే యత్ప్రయత్యభి సంవిశంతి తద్విజిజ్ఞానస్వ తద్బ్రహ్మ. " ఎవ్వని వలన ఈశక్తి విశిష్ట వస్తుసమూహముతో ప్రాణి జంగమ జీవజంతువులుత్పన్న మగుచున్నవో, ఉత్పన్న మై ఎవ్వని ద్వారా అవి జీవించుచున్నవో, ఎద్దానిప్రవేశించుచున్నవో ఆయనను విశేషరూపముగ తెలిసి కొనుటకు నిచ్చగింపుడి. ఆయనయే బ్రహ్మము. ”


పిమ్మట ఈశ్వరుడు ఆనంద స్వరూపుడను సత్యము నాహృద



"