పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వివేకానందస్వామి

77

వానికిఁ దీసిపోవు. అగ్గిపుల్లల యంత్రశాలలు చూచువారికి మిక్కిలి వినోదమును కలిగించుచున్నవి. జపానువారు ప్రతివస్తువును తమదేశమునందే చేసికొనుటకు ప్రయత్నించుచున్నారు. ఈకాలపు నాగరికత నిచ్చటి మతగురువులుకూడ నేర్చి యవలంబించినారు. జపానువారి గొప్పతనమంతయు నేనొక్కజాబులో వ్రాయఁజాలను. కాని మనవాండ్రలో పడుచువాండ్రు సంవత్సరమునకుఁ గొందఱు చొప్పున వచ్చి యీదేశమును జూతురుగాక యని కోరుచున్నాను. వారిట్లున్న వారు. మీరెట్లున్నవారు. యావజ్జీవము శుష్కప్రియములు పలుకుచు కాలము పాడుచేయుచున్నారు. ఒకమారువచ్చి యీదేశస్థులనుజూచి సిగ్గుపడి తలలువంచుకొనుఁడు. కూర్చుని ముసలివాండ్రవలె కదలలేక యిల్లువిడిచిన జాతిపోవునని భయపడుచున్నారా! వేయియేండ్లనుండి మూఢవిశ్వాసములో మునిఁగితేలుచు నీయన్నము ముట్టవచ్చునా యన్నము ముట్టఁగూడదను కుశ్శంకలతోఁ గాలమంతయు గడపుచు భూతదయనంతను జంపుకొని మీరిప్పుడున్నారు. చచ్చి చెడి పుస్తకములను వర్ణనవేసి పెద్దపరీక్షలయందుఁ దేరి యే కచ్చేరీలోనో ముప్పది రూపాయల గుమస్తాపనికి దేవులాడుటయో లేక ప్లీడరగుటయో మీపురుషార్థముగానున్నట్టు గాఁనబడుచున్నది. మీపుస్తకములను మీ బి. యే. గౌనులను మీ పట్టాలను మిమ్ములను ముంచివేయుటకు సముద్రములో నీరులేదా, రండి పౌరుషము దెచ్చుకొనుండి. మీకూపములు విడిచి బైటికి రండి. ఇతరజాతు లేవిధముగా మహాభి వృద్ధిని బొందుచున్నవో చూడుఁడి. వెనుకకుఁ జూడక ముందడుగే వేయుఁడి.

వివేకానందస్వామి వర్ణముల విషయమున నొక యుపన్యాసము సేయుచు నిట్లనియె. ఒకవర్ణమునకుఁ దక్కిన వర్ణములకంటె