పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/97

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
78
మహాపురుషుల జీవితములునెక్కువ యధికారము గౌరవమునిచ్చు దినములు గతించిపోయినవి. అవి మరల రావు. వానినగురించి మనము పోరాడుచున్న పక్షమున మనము క్రమ క్రమంబున బలహీనుల మగుదము. ఈ వర్ణవిషయమున మహమ్మదీయ మతముగూడ కొంతపనిజేసినది. మహమ్మదీయ పరిపాలన యధమ జాతులకును బీదలకును విముక్తి గలుగజేసినది. అందుచేతనే హిందువులలో నైదవవంతు జనులు తురకలైరి. ఇది యంతయుబలవంతముగా ఖడ్గముతోనే వారుచేసిరని మన మనరాదు. అట్లనుట కేవలము పిచ్చి. మనమేమియుసేయక యూరకున్న పక్షమున నీ చెన్నపురి రాజధానియందలి జనులలో సగము క్రైస్తవులగుదురు. నేను మలబారు జిల్లాలో నొకచిత్రమయిన యాచారమును చూచితిని. మాలవాఁడు బ్రాహ్మణులు నడచునట్టి దారిని నడువరాదు. ఆ మాలవాఁడే క్రైస్తవుఁడో మహమ్మదీయుఁడో యైనవచ్చినపుడు మనము వానిని స్పృశియించుటకయిన సందేహింపము. దీనినిబట్టి మనమేమి తెలిసికొనవలయును? ఆ మలబారులో నుండు వారందఱు పిచ్చివాండ్రనియు వారియిండ్లు పిచ్చివాండ్ర వైద్యాశాలలనియు గ్రహింపవలయును. ఇట్టి దురాచారములు గల జాతుల వారుండుట తలవంపులు గావా? శూద్రుఁడు వేదము విన్న పక్షమున వానిచెవిలో సీసము కరిగించి పోయవలయునఁట! వాఁడు వేదముచర్చించిన నాలుక కోయవలయునఁట ! ఇట్టి భయంకరవాక్యములుగల గ్రంథము లనేకములు మనపూర్వులు వ్రాసినవి వున్నవి. అట్లువ్రాసిన పాపాత్ములనేకులు ప్రతిస్థలమునందు ప్రతికాలమందు నుండుచువచ్చిరి.

ఈకాలమునందు వర్ణభేదములగూర్చి యెన్నో వివాదములు పొడముచున్నవని నేను విచారించుచున్నాను. ఇట్టివాదము లుండఁగూడదు. ఇవి యుభయులకు నందుముఖ్యముగ బ్రాహ్మణులకు