పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

మహాపురుషుల జీవితములు

మ్లేచ్ఛుల కుపదేశించి మనమతమునకు విరుద్ధముగా చరించిన వివేకానందస్వామి సంస్కారమునకు విరోధియని పలుకుట కేవలం హాస్యాస్పదముగాదా! ఆయనచేసిన యుపదేశమిది. "ఇంగ్లీషువారుచేయు చున్నారను కారణముచేతనే పని చేయవలదు. అది మంచిదేయైన పక్షమునఁ జేయవలయును. మనశాస్త్రములఁ జదువకుండ నిరాకరింపవద్దు. మన మతగ్రంథములన్నియుం జదివి యందులోనున్న మంచి గ్రహింపవలయును. మనశాస్త్రములలో దేశాభివృద్ధికి భంగకరములైన సంగతు లనేకములున్నవి. వానిని మంచివానిఁగ మార్చుకొని మనమభివృద్ధి పొందవలయును. మనమందఱము మూఢ విశ్వాసములోఁ బడియున్నారము. ఆమూఢ విశ్వాసము నశించినప్పుడుగాని దేశము బాగుపడదు. విదేశప్రయాణములు హిందువులందఱు యధేచ్ఛముగా చేసి యాయాదేశములందున్న క్రొత్త విద్యలు నేర్చుకొని మన దేశమును బాగుచేయవలసినదేకాని దేశమును విడిచిపోవుట తప్పుగాదు". ఈమొదలగు సంగతులే యతఁడు తన యుపన్యాసములలోఁ దరుచుగఁజెప్పుచు వచ్చెను. మతమునందు సంఘమునందు ననేకసంస్కారముల నాయన చేయన సంకల్పించెను. విదేశప్రయాణము మొదలగు సంస్కారములం దాయనకు మిక్కిలి యిష్టమని తెలియజేయుటకై యాయన జపాను దేశమునుండి వ్రాసిన జాబును యుపన్యాసములలో కొన్ని భాగముల నీక్రింద తెలిగించి యుదహరించుచున్నాము.

"జపానుదేశస్థులు ప్రస్తుతకాలమున కనుగుణముగా నడచుకొనుట యావశ్యకమని తెలిసికొనిరి. వారు తమ దేశస్థులలో నొకఁడు కనిపెట్టిన క్రొత్తరంగులతో సన్నాహముచేయఁబడిన యొక మహాసేనను సిద్ధముచేసియున్నారు. ఆ ఫిఱంగులు తక్కిన దేశముల