పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

మహాపురుషుల జీవితములు

కృష్ణమోహనుని పద్ధతులు బంగాళీల కందఱకు మహాగ్రహమును దెప్పించెను, ఆగోలఁ జూచి యతని స్వజనముగూడ వాని నింటనుండి యవ్వలకుఁ బంపివేసెను. మొదటినుండియు నతనికిఁ గ్రైస్తవ మతబోధకులు మిత్రులుగా నుండుటచే వానికిఁ గ్రైస్తవ మతముపై నత్యంతాభిమానము బొడమెను. అయభిమానము కతనమున నతఁడు పలుమారు బైబిలు మొదలగు గ్రంథములు చదివి యెట్ట కేలకు 1832 వ సంవత్సరమున గ్రైస్తవమతము నవలంభించెను. డాక్‌టరు టఫ్ దొరగా రా సమయమున ప్రధనాచార్యుఁడై పరిశుద్ధస్నానము చేయించి వాని నా మతమునఁ గలిపిరి. కలిపిన వెంటనే కృష్ణమోహనుఁడు కొంతకాలమువఱకుఁ బ్రయాగ మండలమునఁ బ్రయాణముచేసి 1835 వ సంవత్సరమున తన భార్యను తన స్వాధీనము చేసుకొనెను. తరువాత చర్చిమిషను స్కూలులో నుపాధ్యాయుఁడై కొంతకాల ముండి యవ్వలనొక చర్చికధికారియై యచ్చటి పనులను మిక్కిలి సామర్థ్యముతో నెరవేర్చు చుండెను. తాను గలియుటయే గాక కృష్ణమోహనుఁడు తనతోడి హిందూ బాలకుల ననేకులఁ గ్రైస్తవ మతమున గలిపెను. 1852 వ సంవత్సరమున బిషపు కళాశాలలో నతఁ డుపాధ్యాయుఁడుగా బ్రవేశించి 1858 వ సంవత్సరము వఱకు నచ్చట పనిచేసెను. ఈయన తాను ప్రవేశించిన క్రొత్త మతమునందు మిక్కిలి యభిమానము గలవాఁడై యా మతమును తన దేశస్థులకు బోధించుచు దద్విషయమున ననేక గ్రంథములు బంగాళీలోను నొంగ్లీషులోను వ్రాసి ప్రచురించెను. ఈయన పదిభాషలలో పండితుఁడు. ఓడ్రభాషయందు సంస్కృతభాషయందు బి. ఏ. మొదలగు పరీక్షలకుఁ జాలకాలమతఁడు పరీక్షకుఁడుగా నియమింపఁబడెను. ఈయన వ్రాసిన గ్రంథములలోని రెండు ముఖ్యమయినవి గలవు. అందొకటి హిందువుల వేదాంతశాస్త్ర విషయమయి సంభా