9
డైరీలు
16 జనవరి, బుధవారం :
కేశనపల్లి నరసింగరావు పంతులు ఇవాళ సాయంత్రం రమ్మనమని నాకు కబురంపారు. ఈనెల 17, 18, 19 వ తేదీల బేటా, ఆర్రూపాయిలు శ్రీ బాలయ్యనాయుడుగారు యిచ్చారు; ఇమ్మనమని నే నడగ లేదు.
18 జనవరి, శుక్రవారం :
శ్రీ మాధవరావుగారిని చూస్తున్నకొద్దీ ఆయనమీద నాకు గౌరవం హెచ్చుతూవుంది.
నంబరు 32, తంబుచెట్టివీధినుంచి శ్రీ జి. నారాయణమూర్తిగారిలేఖ.
19 జనవరి, శనివారం :
జె. యం. గ్లీసన్ ఎస్క్వే, సూపరెండెంటు, సెయింటు జార్జికెథడ్రెల్రోడ్డు, తేనాంపేట.
శ్రీ మాధవరావుగారివద్ద 27 రూపాయలు చేబదులు పుచ్చుకున్నాను.
21 జనవరి, సోమవారం :
ఇవాళ బి. ఏ లను గురించీ, ఎలక్షన్లగురించీ తమ అభిప్రాయాలను మహారాజావారు మా యెదుట వ్యక్తపరచారు.
ఉదయపూర్ దివాన్ పన్నాలాల్జీకి స్వాగతమిచ్చాను. దివానుగారు వృద్ధులు. కాని మంచి ఆరోగ్యవంతులు. నవ్వుతూ కనిపించారు. ఆయన తాతగారే కాబోసు, మహారాజావారికి