పుట:Mahaakavi dairiilu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

9

డైరీలు


16 జనవరి, బుధవారం :

కేశనపల్లి నరసింగరావు పంతులు ఇవాళ సాయంత్రం రమ్మనమని నాకు కబురంపారు. ఈనెల 17, 18, 19 వ తేదీల బేటా, ఆర్రూపాయిలు శ్రీ బాలయ్యనాయుడుగారు యిచ్చారు; ఇమ్మనమని నే నడగ లేదు.

18 జనవరి, శుక్రవారం :

శ్రీ మాధవరావుగారిని చూస్తున్నకొద్దీ ఆయనమీద నాకు గౌరవం హెచ్చుతూవుంది.

నంబరు 32, తంబుచెట్టివీధినుంచి శ్రీ జి. నారాయణమూర్తిగారిలేఖ.

19 జనవరి, శనివారం :

జె. యం. గ్లీసన్ ఎస్క్వే, సూపరెండెంటు, సెయింటు జార్జికెథడ్రెల్‌రోడ్డు, తేనాంపేట.

శ్రీ మాధవరావుగారివద్ద 27 రూపాయలు చేబదులు పుచ్చుకున్నాను.

21 జనవరి, సోమవారం :

ఇవాళ బి. ఏ లను గురించీ, ఎలక్షన్లగురించీ తమ అభిప్రాయాలను మహారాజావారు మా యెదుట వ్యక్తపరచారు.

ఉదయపూర్ దివాన్ పన్నాలాల్జీకి స్వాగతమిచ్చాను. దివానుగారు వృద్ధులు. కాని మంచి ఆరోగ్యవంతులు. నవ్వుతూ కనిపించారు. ఆయన తాతగారే కాబోసు, మహారాజావారికి