పుట:Mahaakavi dairiilu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గురజాడ రచనలు

10


లోగడ ఉదయపూర్ నుంచి ఉత్తరం వ్రాస్త. మహారాజావారు తాము కూచున్న కుర్చీలోంచి కొంచెంలేచి ఆయనకు నమస్కరించారు. కుర్చీ చూపించి కూచోమని గౌరవించారు. దివానుగారు రాజా వారియెడల ఎంతో గౌరవం కనబరిచారు.

31 జనవరి, లక్ష్మివారం :

మహారాజావారు విజయనగరం బయలుదేరారు.

7 ఫిబ్రవరి, లక్ష్మివారం :

టిఫిన్ ఏడణాలు.

లిటరరీ సొసైటీ నుంచి శ్రీ సూర్యనారాయణ పంతులు తెచ్చిన పుస్తకాలను వొక వాల్యూంతప్ప, మిగిలినవన్నీ వాపసు చేశాను. మహారాజావారి వద్ద లేనివి మూడు గ్రంథాలు యిక్కడ వున్నాయి.

8 ఫిబ్రవరి, శుక్రవారం :

పొద్దున్నే వొక మోతాదుమందు.

కోచ్‌వానికి అణాముక్కాణీ యిచ్చాను. పోస్టేజి నాలుగణాలు. లిటరరీసొసైటీ లైబ్రరీనుంచీ ఇండియన్ ఆంటిక్వరీ వాల్యూములు పట్టుకొచ్చాను. కంపోజిటరుకు ఒక రూపాయి యీనాంయిచ్చాను. పనిచూస్తే చాలావుంది. చేతినిండాపనే. అయితే వున్నది మాత్రం ఒక్కడు. మిగిలినవాళ్ళంతా ఎవళ్ళ పనుల్లో వాళ్ళు ములిగివున్నారు.

టిఫన్ నాలుగణాలు.