పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మార్కసు క్రాసస్సు

79


మునఁ బ్రజలకు రాజ్యమునకుఁగూడ కొంత వేడి కలిగెను. కొందఱు మహా కులీనులను పట్టి కట్టి తెచ్చి వారికి మరణ దండన విధించిరి. అటుల దుర్మరణము నొందినవారలలో క్రాససు యొక్క తండ్రి, జ్యేష్ఠభ్రాత లిరువురుండిరి. ఈ భయముచేత క్రాసస్సు స్పానియాదేశమున కిరువురు స్నేహితులు నిరువది పరివారకులతో కలిసి ప్రచ్ఛన్న వేషముతో లేచిపోయెను. అక్కడనుగూడఁ బ్రజ లట్టుడికనట్టుడుకుచుండిరి. దానినిఁ జూచి, యతఁ డొంటరిగ సముద్రతీరముననున్న నొక కొండబిలములోఁ బ్రవేశించి, యక్కడ కాలమును గడుపుచుండెను. భోజనపదార్థముల నతని స్నేహితుఁడైన 'విచియస్సు' స్వపరిచారకుని చేతికిచ్చి ప్రచ్ఛన్నముగ బిలద్వారమున నుంపించుచుండెను. వానిని నతఁడు స్వీకరించి పొట్టపోసికొనుచుండెను. ఒంటరిగా కాలము గడుపుట కష్టమని గ్రహించి స్నేహితుఁ డిరువురు కన్యల నతనియొద్దకుఁ బంపించెను. వారితో నతఁడు కాలయాపనచేసి, యెనిమిదిమాసము లందులో నుండి 'సిన్నా' మరణము నొందెనను వార్త విని బయటకు వచ్చి చేరెను.

అజ్ఞాతవాసానంతరమున నతఁడు 2,500 ల కాల్బలమును బోగుచేసి, వానితోఁగూడివెళ్లి, రోమనునాయకుఁ డైన సిల్లాతో సంగమించెను. వీరిరువురు కలిసి యుద్ధమును జేయుచుండిరి. 'క్రాసస్సె' శూరుఁడు కాకపోయినను పట్టుదలతో శత్రువుల నెదిరించి వారినిఁ దరుముచుండెను. దురాశ