పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


చేత చేయరానిపనుల నతఁడు చేయుటచేత నతనిని ప్రజలు దూషించిరి. ఇతనికంటె చిన్నవాఁడైన పాంపేయుని వారు డయతోఁ జూచుచుండిరి. సిల్లాకూడ నతనినిఁ బ్రేమతోఁ జూచుచుండెను. అందుచేత కాసస్సుకు శిరోభారముగ నుండెను. ఒక రోజున 'గురుఁడు పాంపేయి' వచ్చుచున్నాఁడని కొందఱతనితోఁ జెప్పిరి. అప్పుడతఁడు, "వాని గురుత్వ మెంత" యని వారి నడిగెను.

అతఁ డాత్మస్తుతి పరాయణుఁడు. ముఖస్తుతుల కతఁ డితరులకంటె నెక్కుడుగ నభినందించుచుండెను. శూరత్వములో పాంపేయితో సమానుఁడు కాకపోయినను, వ్యవహారములలో నతనిని మించెను. ధనముఁగలిగి పరులకు ఋణముల నిచ్చుచు ప్రతివాదులపక్షమున మాటలాడుటచేత నతని మాటలను ప్రజలు విని యతఁ డనుగ్రహించిన పురుషులనె వారు పెద్దయుద్యోగములలో నియమించుచుండిరి. పరదేశములలోనుండి పోరాడుచున్నప్పుడు పాంపేయిని ప్రేమించుచున్నను గ్రామములోనున్నపు డతనిని నిరాకరించి యతనికి వ్యతిరేకముగ క్రాసస్సు బోధించినప్రకారము కార్యములను వారు నిర్వర్తించుచుండిరి. సాధారణముగ పాంపేయి నలుగురిలో మెసలక కార్యార్థియై వచ్చినవారిని తిరస్కరించి సాటోపముతో నుండెను. క్రాసస్సు యెప్పు డందఱితోను కలిసి మెలిసి తిరుగుచు ప్రతివాని కార్యముల శక్తికొలఁది జేయు