పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'మార్కసు క్రాసస్సు'

'క్రాసస్సు' రోముపట్టణములో నివసించుచుండెను. అతని తండ్రి, గుణదోషవివేచకుఁడు (Censor) గ నుండెను. వీ,రన్నదమ్ములు మువ్వురు. అందులో నితఁడు కడపటివాఁడు. అన్నదమ్ము లందఱు తండ్రికాలములో వివాహమాడిరి. వా రందఱు తండ్రితోఁ గలిసి భోజనముఁ జేయుచుండిరి. పెద్దన్నగారు కాలముచేసినపిదప నతని కుటుంబమును 'క్రాసస్సు' సంరక్షణ చేయుచుండెను. అతఁడు జితేంద్రియుఁడైనను నొక సతీమణి (Vestal Virgin) యొక్క గృహమును తక్కువవెలకు పుచ్చుకొనఁ దలఁచి యామెతో సరససల్లాపము లాడుచుండెనని నొక వదంతి కలిగెనుగాని, నది నిజమైనది కాదు. అతఁడు మంచిగుణములు కలవాఁడైనను, దురాశాపరుఁడని యెంచి, న్యాయాధికారు లతనిని శిక్షచేయక విడిచిరి. సతీమణి స్వగృహము నతని కమ్మివేసెను.

ఈ దురాశచేత నతని గుణములు వన్నె కెక్క లేదు. మొద టతని యాస్తి 300 టాలెంట్లు (1 టాలెంటు = 193 కాసులు). రాజకీయవ్యవహారములలో నున్నపుడు విశేషముగ ధనార్జన నతఁడు చేసెను. అందులో, యుద్ధములలో కొల్ల పెట్టి తెచ్చినది. కొంత, గృహములు కాలిపోవుచున్నపుడు

76