పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోరియలేనస్సు

రోములోని కుటుంబములలో 'మార్సి' కుటుంబమువారు మహా కులీనులు. కోరియోలేనస్సు ఈ కుటుంబమువాఁడు. చిన్ననాఁడు తండ్రి మరణము నొందినందున నతఁడు తల్లి సంరక్షణలో నుండెను. తండ్రి మరణముచేతఁ గొన్ని నష్టములు కలిగినను, సజ్జనుఁడై ప్రతిష్ఠను సంపాదించుటకుఁ బురుషునకు వీలగును. దుర్జనులు కొందఱు దానిని కారణముగ నెన్నుదురు, సాగులేని సారవంతమైన క్షేత్రములోగాబు పెరిఁగిన విధమున శిక్షలేని మహా కులీనుల హృదయములలో దుర్గుణములు బయలువెడలు నను నీతివాక్యమున కతఁడు తార్కాణముగ నుండెను. అతఁడు మనోధైర్యమును నిశ్చల బుద్దియుఁ గలిగి ఘనకార్యములను జేసి, ఘనత వహించెను. అతఁ డింద్రియవ్యాపారములకు లోఁబడి, కలహశీలుఁడై మౌర్ఖ్యముగ సంభాషించుటచేత నతనిని పరు లసహ్యించిరి. నిశ్చలబుద్దితో సుఖదుఃఖముల ననుభవించిన న్యాయాన్యాయ విచక్షణుండును, నబ్ధిగంభీరుఁడును మితాహారుఁడును అని యతఁడు. స్తోత్రము నందినను, ప్రజారాజ్యములోని సభలలో నతఁడు నాటోపముగ మాటలాడి దురాచారముగ నడ

58