పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోరియ లేనస్సు

59


చినందునఁ బరు లతని నిందించిరి. లోకజ్ఞానమువలన మనుజులకు సుశీలత గలుగును, సమవర్తనము వర్తించును. ఆ కాలములో రోమనులు క్షాత్రధర్మమును మన్నించుటయేగాక, ధర్మమన క్షాత్ర ధర్మమే యని యభిప్రాయపడియుండిరి.

మొదటినుండియు 'కోరియలేనస్సు' యుద్ధమునందు సంచరించెను. చిన్నతనములో నతఁ డందులకుఁ దగిన యా యుధముల నెత్తి దించుచుండెను. శరీరముఁగూడ సాము చేయుటచేత సళాకువలె సాగుచుండెను. అన్నివిధములైన గరిడీవిద్యలలో నతఁ డారి తేరెను. కత్తిసాము, మల్లయుధ్ధము, ముష్టియుద్ధములలో నతఁడు పరిపాటుపడెను. అతఁడు మల్లయుద్ధవిశారదుఁడు. అందులో నతనిని మించిన వారులేరు. బరువుగల మనుష్యుఁ డగుటచే నతని నెవరును నెదిరింపలేకపోయిరి. అతఁడు శీఘ్రకాలములో మహా వీరుఁడను పేరుఁ బొందెను,

స్వల్పబుద్ధి కలవారికి శ్రీఘ్రముగఁ గీర్తివచ్చినయెడల వారు దానితో సంతుష్టి నొందుదురు. అంతటితో వారిపని సరి. ఉదారబుద్ధి కలవారికిఁ గీర్తివచ్చినయెడల వా రంతటితో సంతృప్తిఁ జెందక చేసినవానిని చేయఁబూనినమహత్కార్యముల కభిజ్ఞానముగ నుంచుకొని ముందుకు నడచెదరు. కోరియలేనస్సు పై చెప్పఁబడిన రెండవ పక్షములోనివాఁడు. ఆ కాలమున రోమను లనేక యుద్ధములలో మెలంగు