పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆల్సిబియాడీసు

57


తీసి, మంటమీఁదవేసి, యవి ముట్టుకొను లోపున ఖడ్గము ధరించి బయటకు వచ్చెను, ఘాతకు లతనినిఁజూచి చెదరి పోయి దూరమునుండి బాణములను ప్రయోగించినందున నతఁడు నేల వ్రాలి మరణము నొందెను.

సుగుణ దుర్గుణ సంపత్తిఁగలవాఁడై విచ్చలవిడిగ సంచరించి నీతిమార్గము నవలంబింపక స్వదేశీయులకు మేలు కలుగఁ జేయుటకు బదులు వారికిఁ గోపముఁ గలిగించి వారిచేత నతఁడు నిందింపఁబడెను. మంచికాలములోనుండి యుక్తాయుక్త విచక్షణతలేక నడచినందున నతఁడు దుర్మరణము నొందెను.

.