పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆల్సిబియాడీసు

ట్రోజను యుద్ధములోఁ బ్రసిద్ధికెక్కిన 'అజాక్సు' అను వాఁ డితని వంశమునకు మూలపురుషుఁడు. ఇతని తల్లిపేరు 'దినోమాచి'; తండ్రి 'క్లినియసు'. ఇతఁడు 'ఆర్టిమీయమ్‌' వద్ద జరిగిన నౌకాయుద్ధములోఁ బోరాడి పేరుఁబొందెను. ఇతఁడు 'పెరికిలీసు' సంరక్షణలో నుండెను. 'నిసియసు', 'డెమాస్తనీసూ ఇతని సమకాలికులు. మహామహోపాధ్యాయుఁడైన 'సోక్రెటీసు' ఇతనిఁ బ్రేమించుటచేత ఇతనికిఁ గీర్తివచ్చిన దని చెప్పుదురు.

బాల్య యౌవన కౌమారావస్థలలో నితని రూపలావణ్యము లా సేచనములు. అతఁ డస్పుటముగ మాటల నాడుట చేత, ప్రసంగములు రమ్యముగ నుండి మనుష్యుల నాకర్షించు చుండెను. మొదటినుండియు నతని నడవడిక లేకరీతిగ నుండ లేదు. ఆతని భోగభాగ్యములు వృద్ధిక్షయములొందఁ దదను గుణ్యముగ నవియు మారుచుండెను. అతఁడు మనోవ్యాపారములకు లోఁబడెను; ఎదిరించి పోరాడి జయము నొందవలయునను కోరికఁ గలవాఁడు. మల్లయుద్దములో నతఁడు నేలకు ద్రొబ్బఁబడినప్పుడు, పట్టువదలించుకొనుటకు శత్రువు యొక్క

48