పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆల్సిబియాడీసు

49


వ్రేళ్లను కొరుక, వాఁడు 'ఆడుదానివలె' కఱచుచుంటి'వని యెత్తిపొడువ, “లేదు, సింహమువలె"నని అతఁడు జబాబు చెప్పెను.

ఒక రోజున నతఁడు బాలురతో వీధిలో పాచికలాడు చుండ బండి తోలుకొని యొకఁడు వచ్చి వీరిని దారి యొసల మనెను. అతఁ డప్పుడు పాచిక వేయవలసిన సమయము, బండి వాఁడు మోటుతనమున గుఱ్ఱముల నదరి వచ్చుచుండ బాలు రందఱు నొసలిరిగాని యతఁడు మార్గమున కడ్డుగా పండు కొనెను. వాఁ డది చూచి భయపడి శకటమును నిలిపెను.

విద్యార్థిగా నుండుకాలమున నతఁడు "వేణుగానమును నేర్చుకొనుట కిష్టపడలేదు. మురళీ గానము సేయువా రుచ్ఛ్వాస నిశ్వాసముల నరికట్టి మాటలాడుటకు వీలులేదు. వైణికులు గాత్రముచే పాటను వినికిడి చేయఁగలరు. "మే మాథెన్సు పట్టణమువారము, వేణుగానమును నేర్చుకొన"మని యతఁడు పలికినందున నతనివలె నితర బాలురుకూడ దానిని మానిరి.

పెద్దలంద ఱతని స్నేహమును గోరి యతనివద్దకు వచ్చుచుండిరి. అతని సుందరవిగ్రహమును జూచి వారు తనివిఁబొంద లేదు. ధనికుఁడు గనుక నతనిని పరులు చెఱుపుదురను భయముచేత నతని మనోవ్యాపారములు విచ్చలవిడిగ సంచరింప కుండునట్లు నానిని 'సోక్రెటీసు' నిగ్రహించెను.