పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


పరాక్రమములను జూపించుటకు తండ్రి నా కవకాశ మీయఁ”డని అలగ్జాండరు స్నేహితులతోఁ జెప్పి విచారించుచుండెను. "చతురంగబలములతో కూడిన నీ మహా రాజ్యాధిపత్యమును బొందుటకు నే నియ్యకొనను. 'పరిపంధి రాజచక్రంబుమీఁద నవక్ర పరాక్రమంబున శిఖిశిఖాసంకాశ నిశిత శిలీముఖ నారాచ భల్లప్రముఖంబులైన బహువిధ బాణ పరంపరలఁ గురిపించి విదళిత మత్తమాతంగ తురంగరధవరూధ పదాతి యూధంబుగఁజేసి', రణంబున నెదురులేని శౌర్యంబును బాటించి దేశపాలకుల నతిక్రమించి దిగ్విజయముఁ జేసి సామ్రాజ్యమును బొందుటకు నే సభిలషించెద"నని అలగ్జాండరు' స్నేహితునితోఁ బలికి కక్కసపడుచుండెను.

ఒకనాఁడు తండ్రి సమక్షమున కొక తురగము క్రయమునకుఁ 'దేఁబడెను. ఆశ్వపాలకుల కవశ్యమై తట్టుటకైన మనుజులను చేరనీయక, విచ్చలవిడిగ నది సంచరించుటఁ జూచి దానిని క్రయమిచ్చి పుచ్చుకొనుటకు రాజు సమ్మతింపఁ డయ్యెను. దీనిని జూచి 'అలగ్జాండరు' ఎంత చక్కని గుఱ్ఱమును తమరు వదలి వేయుచున్నా”రని తండ్రితో పలుమారు పలికెను. అది విని రాజు "పడుచువాఁడవు. పెద్దలను ధిక్కరించుచున్నావు. వారికంటె దానిని నీవు వశ్యము చేసి కొనఁగలవా” యని కుమారునితోఁ బలికెను. "అది యెంతపని” యని కుమారరాజు నుడివెను, “నీ వొకవేళ