పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహా అలగ్జాండరు

33


దానిమీఁద స్వారిచేయలేకపోయిన, నీ మోటరి తనమునకు నీవేమి యోడెద"వని రాజు తర్జింప, "నేను దాని వెల నిచ్చెద"నని కుమారుఁడు శాంతవచనమునఁ జెప్పెను. అప్పుడు రాజకుమారుఁడు తండ్రిసెలవుఁ గైకొని తురగమును తట్టి ప్రక్కకుఁ ద్రిప్పి, పగ్గములను స్వీకరించి, దాని నారోహించెను. ఆస్కంధిత, ధౌరిత, రేచిత, వల్గిత, ప్లుతనామాంకిత గతులలో నతఁడు దానిని నడిపించి మఱలినందునఁ బరిజనులందఱు సంతసించిరి. ఆనందబాష్పములొలయఁ దండ్రి, "నీకీ 'మాసిడన్‌'దేశము తగినదికాదు. నీవంటి తేజోవంతుఁ డితర దేశములను భుజపరాక్రమముచేత స్వాధీనము చేసికొనవలసిన"దని పలికి కుమారునిఁ గౌఁగిలించుకొనెను.

మహామహోపాధ్యాయుండని పేరుబొందిన 'ఆరిస్టాటిలు'నకు కబురుపెట్టి యతఁడు దన కుమారునకు విద్యాభ్యాసము చేయింపవలసినదని ఫిలిప్పు వేఁడుకొనెను. నీతిశాస్త్ర పారంగతునిగఁ జేయుటయెగాక, యతనినిఁ బ్రగూఢశాస్త్రములలోఁగూడ 'ఆరిస్టాటిలు' ప్రవేశపెట్టెను. మొదటినుండియు వినయవిధేయతలతో గురువును శిష్యుఁడు భావింపుచుండెను. గురుశిష్యుల కత్యంతానురాగము బలిసెను. వైద్యములోఁగూడ కొంత ప్రవేశమును బొంది, మందులఁ జేయుటయం దతఁడు కుశలతఁ గలిగియుండెను.

ఈలోపున ఫిలిప్పు మొదటిభార్యను విడనాడి ద్వితీయ