పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహా అలగ్జాండరు

31

ఫిలిప్పు 'పోటీడయా' పట్టణమును ముట్టడించి దానిని పట్టుకొనినరోజున మువ్వురు హర్కారాలు రాజధానినుండి సుఫుత్రజననవార్త నతనికిఁ దెచ్చిరి. అతని సేనానాయకుఁడు పోరాటములో జయమునొందెననియు, నతని పంచభద్రము 'ఒలింపికు' క్రీడలలో పందెము గెలిచెననియు సుపుత్రుఁడు కలిగెననియు, మూఁడు శుభవార్తల నతఁడు విని, 'పులకించి, చోద్యమంది, యుబ్బి' చెల రేగెను. శిశువునకు 'అలగ్జాండరు' అనెడు నామకరణమును దండ్రి చేసెను.

దినదిన ప్రవర్ధమానముగ మహాపురుషలక్షణములు కలిగి, యతనికి యౌవన ప్రాదుర్భావమయ్యెను. యుక్తకాలమున నతఁడు తగిన యొజ్జలయొద్దఁ బ్రవేశించి విద్యాభ్యాసముఁ జేసెను. రాజకుమారునకుఁ దగిన దేహ మనోసంస్కారముల నతఁడు పొందెను. తండ్రి శత్రువులపై దండెత్తి వెళ్లినపుడు సాం కేతస్థలమున ప్రధానులతో నతఁడు మంతనముఁ జేయుచుండెను. ప్రభు మంత్రోత్సాహ శక్తులను గలిగి దురవగాహమైన గాంభీర్య ధైర్యస్థైర్య జేగీయమానసుండై, భృత్యామాత్య సుహృద్బంధువర్గంబులో నతఁ డనన్యాదృశంబుగ సంచరించెను. 'దళములు దళముగ నడచుచు | దలవంపులు చేసే వారి దళముల నెల్లన్ || అని విని సంతసించక "శత్రుదళములను విదళనము చేసి వారి రాష్ట్రములను స్వరాష్ట్రముతోఁ జేర్చుచు,• దిగ్విజయమును జేయుట చేత నా భుజ