పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30



మహా అలగ్జాండరు

మహా ఆంగ్జాండరు 'హెర్క్యులీస్‌'యొక్క సంతతి వాఁడు. కాని తండ్రి 'ఫిలిప్'; తల్లి 'ఒలింపియస్‌'. చిన్న తనములోనే వీరొకరినొకరు ప్రేమించినందునఁ గాలమువచ్చిన తరువాత వారు వివాహముఁ జేసికొనిరి. కామశాస్త్రము నుపదేశమును బొందుటకు పూర్వము తన గర్భముమీఁద పిడుగుపడి రగులుకొని మంటలు జాజ్వల్యమానముగా నలు దెసల న్యాపించినటుల 'ఒలింపియసు' కలఁగనెను. వివాహాసంతరమున రాజపత్నిగర్భము సింహముద్రాంకితము చేసి నటుల 'ఫిలిప్పు'కు స్వప్నము వచ్చెను. పరిపంధి, రాజచక్రంబుమీద ననక్రపరాక్రమమున సింహంబు కరణి లంఘించి, 'సముద్ర మేఖలానలయిత్వభూచక్రంబు నిర్వక్రంబుగ నధిరోహించుటకుఁ దగిన పుత్రుఁడు కలుగునని జ్యోతిష్కులు స్వప్న ఫలమును 'ఫిలిప్పు'తోఁ జెప్పిరి. అలగ్జాండరు క్రీ. పూ. 356 సం: రము జూలై నెల 6. తేదీని జననమొందెను. ఆ రోజుననే 'ఎఫీషన్‌'లోని 'డయానా' యను పేరుగల చంద్రదేవతయొక్క యాలయము తగులఁబడెను. అక్కడి భక్తులంద ఱీ యాదిభౌతకాధికి వెఱగంధి, చిందఱ వందఱ పడిరి.