పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిశిరో

29


యయ్యెను. ఇంతలోనే రాజ్యాంగములు మాఱి ప్రజాప్రభుత్వమునకు బదులుగ నేకరాజాధిపత్యమును స్థాపించిరి. స్వదేశ చరిత్రను వ్రాయుట కతఁ డుద్యుక్తుఁ డయ్యెను. కాని కొన్ని కారణములచేత దానిని నెరవేర్ప లేకపోయెను. భార్యాభర్తల కింతలో మనస్పర్ధలు రగిలెను. ఆమె విశేషముగ ఋణములను జేసినదని, యుద్ధమునకుఁ బోవునపు డతనికిఁ దగిన యేర్పాటు లామె చేయలేదని, తగిన సన్నాహములను జేసి కూఁతురి నామె తనయొద్దకు పంపలేదనియు, నిందారోపణఁ జేసి భార్య కతఁడు విడియాకు లిచ్చెను. తదనంతుమున మఱియొక కన్య నతఁడు వివాహమాడెను. ఇతని స్వగృహచరితము లిట్లుండెను.

సంసారసాగరము నీదుచు నతఁడు వార్ధక్యము నొందెను. మహాబలాహక ప్రేరితంబులై సముద్రంబులుప్పొంగి. సంగమించుకరణి రాజ్యాంగ తంత్రోత్పాటన సమయంబున దేశ మరాజకమై ప్రజలు యుక్తాయుక్తవిచక్షణదూరులై , విదళిత మనోధైర్యములు కలవా రగుదురు. ఈ సమయములో స్వపక్ష పరపక్ష, వివేచన లేక తృటి కాలములో పక్షములను క్రమాను రూపముగ విడుచుటయుఁ బొందుటయుఁగూడఁ గలదు. అట్టి కాలములో సపక్షమువా రతనికి శత్రువులై గృహకవాటములను భేదించి భృత్యులను విదశించి లోపలఁజొచ్చి శిశిరోను వారు చిత్రవధఁ జేసిరి.