పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డెమాస్తనీసు

25


దాని కనుగుణ్యముగఁ బ్రవచనము నభ్యసించుచుఁ బ్రవచనీయుల ప్రసంగములను వినుచు నతఁ డొకదినమైనను వ్యర్థము చేయలేదు. వ్యవహారశక్తుల నుపయోగించుటకుఁ దగిన సామర్థ్యముఁ బొందవలయుననిన, వ్యావహారికునకు వాచాలత్వము తోడుగా నుండవలెనని స్మరించి తద్రూపమగు పద్ధతుల నతఁ డవలంబించెను. -

అతఁడు వెంటనే మహోల్లాసముతో రాజకార్యములలోఁ బ్రవేశించెను. మొదట వ్యనహారములను నిర్వర్తించుటలో కొంచె మతఁడు తొట్రుపాటుపడినను జాగరూకతతో పనులను జేయుచుండెను. ప్రజ లతనిని దయాళువు, పిఱికిపందయని నిరసించిరి. పుస్తకజ్ఞానము తప్ప లోకజ్ఞానము లేని వాఁడని ప్రవాదముకూడఁ గలదు. గౌరవమును బొందవలె నను వాంఛ కలవాఁడగుట చేత నతనిని తండ్రి, స్నేహితులు ప్రోత్సాహపఱచినందున నతఁడు న్యాయవాదిగ సభలోనికి వెళ్లెను. క్రమముగ నతఁడు వాచాలకుఁడని దేశమందంతట వెల్లడియై సమకాలీనులలో గొప్ప వక్తయని ప్రసిద్ది నొందెను.

ఒక కాలమున క్షామము కలిగినందున నతనిని వికర్నికునిగ (Queestor) 'సెనేటు' సభవారు నియోగించి సిసిలీ ద్వీపమునకుఁ బొమ్మని యుత్తరవుచేసిరి. అక్కడి ప్రజలను మొదట నట్టహాసముతో ధాన్యమును రోముపట్టణమునకు బంపవలసిన