పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


దని నిరోధించినను నతఁడు వారిని నెమ్మదిగను న్యాయముగను పరిపాలించెను. రోముపట్టణములోని కులీనులైన కొందఱు పురుషులు మితిమీఱి ప్రవర్తించుటచేత వారిని సిసిలీద్వీపమునకు సభవారు వెడలఁగొట్టిరి. అక్కడ ప్రజాప్రతినిధియెదుట వారిపక్షము నవలంబించి శిశిరో ముచ్చటించెను. ఈ మహత్కార్యములను జేసినందు కతఁ డుబ్బినవాఁడై రోములో నందఱుఁ దనను విశేషముగఁ జెప్పుకొనుచుందురని తలంచి మార్గమున వచ్చుచు నతఁడొక స్నేహితునితో నీ విషయమును గుఱించి తర్కించెను. "ఇన్ని రోజులనుండి తమ రెక్కడనుంటి” రని వాఁడు ప్రతివచనమిచ్చెను.

మహా సముద్రములోఁ జిరుచేపవలె నతని కార్యములు రోములో మునిఁగిపోయినందుకు విచారించి వాంఛలను, తగ్గించుట కతఁడు సమకట్టెను. కీర్తిసముద్ర మపార మని యతఁడు గ్రహించెను. అయినను ముఖస్తుతియం దాసక్తియుఁ, గీర్తియం దపరిమితమగు కోరికయు గనుక నతని యధ్యవసాయములు కొన్ని సాగలేదు. శిల్పకారులు తమ పనిముట్లను వేర్వేరుగ గుఱ్తెఱిఁగినవిధమున రాజకార్యధురంధరుఁడు ప్రజలను వారివారి నామములతోఁ దెలిసికొన వలయును. అందుచేత నతఁడుగూడ నాగరికుల నందఱను వారి వారి పుట్టుపూర్వోత్తరములతోఁగూడ విచారించి వారిని జ్ఞప్తిలో నుంచెను. అతఁడు దేశ సంచారమునకు