పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


శ్రవణ మననములలో, సతఁడు కాలమును గడిపెను. 'సిల్లా' యను నతఁడు ప్రభువై స్థిరముగఁ గొంత రాజ్యతంత్రము నిర్మాణించువఱకు నతఁడీప్రకారమున దివసములను జరిపెను.

'సిల్లా' రాజ్యాంగములను నడుపు కాలమున నతఁడు వక్తృత్వాభ్యాసమును జేయు చుండెను. కొన్నిదినములు దేశసంచారములో నతఁడు గడిపెను. ఈ దినములలో సుఖదుఃఖములను సమముగఁ జూచుటకు కొందఱు వైరంగికులు (Stoics) బయలు వెడలి యొక పాఠశాలను స్థాపించి దానిలో వారు సిద్ధాంతీకరించు చుండిరి. ఈ పాఠశాలలో 'శిశిరో' ప్రవేశించి వారి నియమములఁ గొన్నిటిని పరిగ్రహించెను. రాజకార్యములలో ప్రవేశించుట కతనికి సమయములు దొరకనప్పుడు 'ఆథెన్సు' పట్టణమునకుఁ బోయి యక్కడ శాస్త్ర శోధన జేయుచు దినములను గడపఁగోరెను..

ఇంతలో 'సిల్లా' మరణమునొందె నని వార్త శిశిరోకు వచ్చెను. ఇంతకుఁ బూర్వము దేహపరిశ్రమను జేసి దాని సతఁడు దృఢపఱచుకొనెను. అతని కంఠస్వరము తీరుగఁ గుదురుపడి కుహరాంతరాళముల నిండునటుల పూరించి మృదు మధురయుక్తముగఁ బ్రస్తావించుట కతనికి శక్తికలిగెను. రోము పట్టణములో స్నేహితు లతని నక్కడకు విజయముచేయ వలసినదని వేఁడుచు నుత్తరములు వ్రాయుట చేత సతఁ డక్క.డకుఁ బోయి రాజకార్యములలోఁ బ్రవేశించుటకు సమకట్టెను.