పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిశిరో

ఇతని తల్లిపేరు ' హెల్వియా'. ఆమె కులీనురాలు; మంచి గుణములు కలది. ఇతని తండ్రికిఁ గల యభివాదము మంచిది కాదు. అతఁడు రజకుఁడని వాడుక కలదు. పనిలోఁ బ్రవేశించినపుడు పేరును మార్చవలసినదని శిశిరోను స్నేహితులు వేఁడిరి.. కాని యతఁ డా పేరును వహించియే కీర్తినొందెద నని బదులు చెప్పెను. ఇతఁడు క్రీ. ప్రూ. 78 సం॥ రమున జనవరి మూఁడవ తేదీని జనన మొందెను. ప్రతి సంవత్సర మారోజున న్యాయకర్త లందఱును చక్రవర్తి క్షేమమునకు హోమముచేసి దైవప్రార్థనఁ జేయు వాడుకకలదు. ఇతని జననకాలమునఁ దల్లి విశేషముగఁ బ్రసవవేదనఁబడలేదు. ఇతని పెంపుడుదాది కొక ఛాయా పురుషుఁ డగుపడి భాగ్యవశమున నామె పెంచుచున్న శిశివు గొప్పవాఁడు కాఁగలఁ డనియు రోముపట్టణములోఁ బురుష సింహ మను పేరొందు ననియుఁ జెప్పెను. ఈ సోదెయొక్క సత్య మతని చేతలవలస తేట తెల్ల మయ్యెను. యుక్తవయస్సున నతఁడు పాఠశాలకుఁ బంపఁబడెను. అప్పు డతఁడు మేధావియని పలువురు తెలిసికొని యతనిని దర్శించుటకు పాఠశాలకుఁ బోవు చుండిరి. బాలురచే సన్మానింపఁబడి వారిలో సగ్రాసన మతఁ

22