పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డెమాస్తనీసు

23


డధిష్ఠించెను, ' ప్లేటో' చెప్పినప్రకారము పండితునకును జ్ఞానికిని గావలసిన గుణము లతనికిఁ బట్టెను. అన్ని విద్యలను నేర్చుకొనుటకుఁ దగిన ధారణాశక్తిని గలిగియుండి యేవిద్యను నతఁడు తృణీకరించలేదు. అన్నిటిలోను గావ్యరచనయం దతని కాసక్తి మెండు. కాలాంతరమున పూనికతో నవ్యామోహమును సమజేర్చి గొప్ప కవీశ్వరుఁ డనియె కాక, గొప్ప వక్తయనికూడ నతఁడు ప్రసిద్ధినొందెను. భాషలో నేఁటికి కొన్ని మార్పులు వచ్చినను, నతనిప్రవచనీయము లిప్పటికిని శ్లాఘింపఁబడుచున్నవి. ఆతని యనంతరమున గొందఱు కావ్య నిపుణులు బయలుదేరినందున నతని కావ్యములు నీరసించి నేఁ డుపేక్షఁ జేయఁబడినవి.

సాధారణముగ బాలురకుఁ బఠనయోగ్యములైన చదువుల నతఁడు సాంతముగ నభ్యసించినపైని విద్వాంసుఁడగు 'పైలో' యొక్క ప్రసంగములను వినెను. 'సెనేటు' సభాధ్యక్షుఁడును న్యాయవాదియునైన 'మూసియసు-స్కివోలా' యను వానివద్ద న్యాయశాస్త్రము నతఁడు నేర్చెను. 'సిల్లా' యను వానియొద్ద శిక్షను బొంది శస్త్రవిద్యయం దభిలాష గలవాఁ డయ్యెను. జనప్రకోపమువలన ప్రజారాజ్యతంత్ర మల్లకల్లోలముగా నుండుటచేత దేశము తుదకు నిరంకుశ రాజాధిపత్యమగు నని యెంచి, శాస్త్రపరిశోధనఁ జేయుచు, విద్వాంసులతో ముచ్చటించుచుఁ, గావ్యాలాపవినోదములఁ దేలి