పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డెమాస్తనీసు

21


ఆతఁ డుపన్యసించుచుండ 'అధీనియను' లొకవేళ నతని వాగ్దారాసంపాతమునకు సంతసించుచు, నొకవేళ పరవశత్వము నొందుచు, కొన్ని సమయముల హృదయచాంచల్యమునకు లోనగుచు, మఱికొన్ని సమయముల దుఃఖపూరితమనస్కు లగుచుందురు. ఒకప్పు డతఁడు తన వాచాలతచేత తన దేశస్థులను శౌర్య స్థైర్యాదిగుణంబు లంకురింపఁజేసి పుత్రధనయోషా మిత్రసంపత్కళాప్రస్థానంబులను వీడఁజేసి తత్తరంబున రణంబునకు దుముకఁ జేయును. ఇటుల దన వాచాలత్వమున, సూర్యమండలము ననుసరించి తిరుగు గ్రహములవలెఁ బ్రజ లతనిని బరి వేష్ఠించి సంచరించు చుండిరి.