పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13


డెమాస్తనీసు

డెమాస్తనీసు తండ్రి, డెమాస్తనీసు, 'ఆథెన్సు' పట్టణములో నివసించుచుండెను. అతఁడు ఖడ్గకారకుఁడు. అనేకమంది సేవకుల చే నతఁ డాపనిని చేయించుచుండెను. రాజద్రోహముచేసి దేశమునుండి పరారియైన 'గైలాను'నకును, నతని భార్యయైన యొక కిరాతక స్త్రీకినిఁ బుట్టిన చిన్నది డెమాస్తనీసు యొక్క తల్లియని కొందఱు చెప్పుదురు. కాని దాని యధార్థ్యమును నిర్ణయించుటకు వీలులేదు. ఇతఁడు మాణవకుఁడుగ నుండినప్పుడు తండ్రి డెమాస్తనీసు కాలము జేసెను. పిత్రార్జితము దరిదాపుగ, నరువదివేల రూష్యము లితనికిఁ జెందెను. ఇతని సంరక్షుకులు తమ స్వంతమునకు దీనిలోనుండి కొంతసొమ్ము నుపయోగించుట చేతను, శేషించినదానిని సద్వినియోగముఁ జేయక పోవుటచేతను, ఇతనికిఁ జేయవలసిన సంస్కారములు వారు జేయక యుపేక్షించిరి. ఇతఁడీయవలసిన గురు కట్నములఁగూడ వారు తమ స్వంతమునకు వాడుకొనిరి. ఇట్లీతని బుద్ధికుశలతకుఁదగిన జ్ఞానసంస్కారము లేనందున నితఁడు దాని ఫలితమును బొందుట కనకాశము లేకపోయెను. ఇతని శరీరము సున్నితమైనందున నితనిని మొండిపనులఁ జేయుటలో నియమించుట