పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


కితని తల్లి కిష్టము లేక యుండెను. వారి వేతనములు వారికి తిన్నఁగ నందక పోవుటచేత గురువు లితనిని దేహపరిశ్రమఁ జేయవలసినదని నిరోధించ లేదు. మొదటినుండియు నితఁ డర్భకుఁడు. అందు చేత బాలురంద ఱితని నపహసించుచుండిరి.

సర్వజనసమక్షమునఁ బ్రసంగించుట కీకాలములో నితని కాకాంక్ష కలిగెను. ఒక సమయమున 'లౌలీస్ట్రేటసు' అను నొక వాక్చతురుఁడు విచారణసమయమునఁ దన వక్తృత్వమును సర్వ జనసమక్షమున విశదపఱచునని విని, డెమాస్తనీసు తన యుపాధ్యాయులను వేఁడుకొని వారితోఁగూడ సభకుఁబోయెను. నాఁడు వాక్చతురిని వాగ్ధోరణిచేత పగవశులయి యందఱును వానిని స్తోత్రముజేసిరి. అందుచేతఁ దాను సహితము వానిం బోలు వాక్చతురుఁడని పేరుఁ బొందుటకు నిశ్చయించి, బాల క్రీడలయం దాసక్తి వదలి, డెమాస్తనీసు ,వాక్పాటవాయత్త చిత్తుం డయ్యెను. సువక్తృత్వమునందు సంస్కారమును బొందుటకు 'ఐసోక్రేటీసు' అను పేరుగల గురువు నాశ్రయించెను. తన బాల్యావస్థ గడచినపిదప తన సంరక్షకులను వారు చేసిన పనులకుఁ గారణములను జూపుఁడని న్యాయసభలో ఖచితముగ నడిగెను. వారు కపటముగ సంచరించి కాలయాపనఁ జేయుటచేత, వారిని నిరాకరించుచుఁ దన వాగ్వైభవమును న్యాయసభలోఁ గనుపఱచుట కతని కవకాశ మయ్యెను. ఎంత పోరాడినను బితృధనములో నతనికిఁ గొంచెము సొమ్ము