పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డెమాస్తనీసు

15


మాత్రమే చిక్కెను. ఈ మూలమునఁ గొంత స్వానుభవముఁ బరిపాటినిఁ బొంది, రాజకీయ వ్యవహారములలోఁ దన వాగ్వై భవమును సభలోఁ బ్రకటనఁ జేయుటకు యత్నించి క్రమముగ నతఁడు పేరుపొందెను.

మొదట నతఁడు సభలోఁ బ్రసంగించుట కుపక్రమింపఁ దొందరపాటులో వాక్యవిరామముల నతిక్రమించి పూర్వపక్ష సిద్ధాంతముల నసందర్భముఁ జేసెను. మాటలలో స్ఖలితస్వరుఁడై యేక రీతిగ ధోరణిని నడిపించుటకు వాయువు చాలనందున నతని ప్రస్తావమును సొంతముగ వినుటకు సభ్యులు రోసి యతని నధిక్షేపించిరి. సాలంకారనిష్యందమునకు లావణ్యోత్కర్షలను సమకూర్చునది ప్రవృత్తియె యని తెలిసికొని, సోచ్చారణాంగ విక్షేపవిముక్త ప్రవచనము లప్రశంసనీయము లని యతఁడు గ్రహించెను, నాఁటినుండియు భూగర్భమున నొక బిలమును నిత్యానుష్ఠానమున కేర్పఱచుకొని, రెండుమూఁడు నెలలపర్యంత మక్కడ నతఁడుండి పోవుచుండెను. అక్కడనుండి బయటకు రావలె నని తనకోర్కె పొడమిన నటుల వచ్చుటకు విఘ్నము కలుగునట్లతఁడు తన శిరస్సును సగము ముండనము చేసికొనెను.

అతఁడొకరి దర్శనమునకు వెళ్లినపుడుకాని, యతని దర్శ నమున కితరులు వచ్చినపుడుకాని జరిగిన ప్రస్తావనాంశములు అనఁగా విశ్రుతమైన వ్యవహారము లతని కభ్యాసముఁ గలుగఁ జేయుచుండెను. స్నేహితులు వెళ్లినపైని నతఁ డధ్యయనాగార