పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


నికి రాఁగలరు. ఏపాటిబుద్ది లేకపోయిన దేహశుద్ధివలన వాఁడు మొండిదేరునుగాని సన్మార్గములోనికి రాలేఁడు. ఉన్నటువంటి తగుపాటి బుద్దినైనను నిర్మలము చేయవలెనుగాని దెబ్బలుకొట్టి దానిని మలినము చేయరాదు. దేహపీడయైనకొలఁది మనస్సు శుద్దిని బొందుచుండును; సిగ్గులజ్జలను బోఁగొట్టునది దానికంటె మఱియొకటిలేదు. ఆ రెండును గలిగియుండిన, ధర్మము. నిలఁబడును; కీర్తి ప్రతిష్ఠలు వచ్చును.

ఇప్పటి మనవలెఁగాక గ్రీకులు మఱియొక విధమున విద్యాభ్యాసము జేయుచుండిరి. ప్రారంభములోనే నా రన్ని శాస్త్రములలోను బ్రవేశ పెట్టఁబడుచుండిరి. రామచిలుకలవలె మనము మాటలనుమాత్రము గ్రహింతుము; వారు మాటలచేత నిరూపింపఁబడిన వస్తుజ్ఞానమును గలిగియుండిరి. మనవలె రెండప్రచలిత భాషలను జదువుటలోఁ బదిసంవత్సరముల కాలమును వారు వ్యర్ధపుచ్చుట లేదు. ఆ కాలమున వారు ప్రకృతిని పరిశోధించుటలో గడిపి, దానిలోని చిత్రముల యథార్థ్యమును వాని నియమములను గ్రహించుచుండిరి. తత్వ, గణిత శాస్త్రములనేగాక శబ్దోత్పత్తి శాస్త్రము (Philology) ను వా రభ్యసించిరి. మహాకవుల గ్రంథములలోని ప్రస్తావికవచనములను వారు జిహ్వాగ్రమున సుంచుకొనిరి.

ఈ విద్యలలో 'ఫ్లూటార్కు' పూర్ణుఁడై మహాపురుషుల జీవితచరిత్రలను వ్రాసెను. ధారణాశక్తి విశేషముగఁ గలదు.