పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్లూటార్కు

5


కనుకనే, చెప్పిన యంశములను జెప్పక చరిత్ర నతఁడు వ్రాసెను. నూటికొకచోట పునరుక్తి కలదుకాని సాధారణముగఁ గనఁబడదు.

వేషభాషలవలన నతఁడు శాస్త్రజిజ్ఞాసకులలోనివాఁడని తెలియుచున్నది. క్రియలు, మాటలు, ఉపదేశములు, ఆచరణలలో నతఁడు దాని కనుగుణ్యముగ నడిచెను. క్రమముగ నతఁడు తత్వజ్ఞానమును బొందె నని యతని గ్రంథముల మూలమున దెలియుచున్నది. అందఱి మతములను బరిశీలించి శాస్త్రజిజ్ఞాసకులను, విషయాసక్తులను జెందక, బ్రహ్మజిజ్ఞాసకులపక్ష మతఁ డవలంబించెను. నైరంగికుల నతఁడు ముట్టలేదు. అందఱి బోధలలోను శ్రేష్ఠ మగునానిని గ్రహించి నాని నతఁ డనుష్ఠించెను.

ప్రకృతి నారాధించు 'పైథాగొరాసు' క్షుద్రజంతువులను మనుజులు హింసించుటఁ జూచి, విచారించి, యొక్కమతమును గనిపెట్టెను. దానినే పునర్జన్మమత' (Metempsychosis) మందురు. జీవుఁడొక శరీరములోనుండి మఱియొక శరీరములోఁ బ్రవేశించునని, దీని సిద్ధాంతము. ఈమూలమున జంతువులకు హింసలేకుండఁజేయుట యతని యభిప్రాయము. మొదటినుండి సృష్టిలోని పిపీలికాది జీవకోటులనుజూచి సంతసించుచున్న 'ప్లూటార్కు' ఈమతసిద్దాంతముల నెటుల నవలంబించకుండును? మతబోధకునివలె నతఁడుగూడ నుపన్యసించి, జంతువులను