పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్లూటార్కు

3


చుఁ గొంతకాలము గడిపితిమి. ఇందు కతఁడు కోపగించి, కుమారుఁడేమో భోజనముఁ జేయుచు లేచిపోయె నని మిషఁబెట్టి, వానిని మా సమక్షమున కొట్టించెను. ఈ సమయములో నతఁడు మా వైపు దృష్టి నిగిడించి చూచుచున్నందున, మా నిమిత్త మతఁడు వానిని దండించె నని మేము గ్రహించితిమి.” ఈ సంగతిని 'ఫ్లూటార్కు' వ్రాసినందువలన గురువు విషయాసక్తుల (Epicureans) లోనివాఁడు కాఁడని తెలియుచున్నది. అతఁడు చేసిన శిక్షనుబట్టి యతఁడు వైరంగికుల (Stoics)లోనివాఁడని తోఁచునుకాని నిజముగ నతఁడు శాస్త్రజిజ్ఞాసకుల (Academicians) లోనివాఁడు. వీరి పాఠశాల లాకాలములో గ్రీసుదేశమునందు విశేషముగఁ గీర్తిఁబొందెను.

బెత్తమును వాడుకఁ జేయుటకు తండ్రికిమాత్ర మధికారము కలదు. ఈ పాఠశాలలలో గురువులు దాని నుపయోగించుట లేదు. బుద్ధిని వికసింపఁ జేయుటయే గురువులపనిగాని హేయమై, నికృష్టమై, నీచమైన బెత్తమును బట్టుకొని బాలురను దండించి వారి మనోవ్యాపారములను దగని విధమున నిరోధించి, వారి మర్యాదకుఁ దగిన స్వాతంత్ర్యబుద్ధినిఁ బోఁగొట్టుట, యుపాధ్యాయులకు ధర్మముకాదు. బెత్తమును బట్టుకొని బాలురను గురువులు శిక్షించుట, నేఁడుగూడఁ గలదు. బెత్తము చేత దేహశుద్ధినిఁ బొందుట కాదుకాని, సిగ్గులజ్ఞలవలన, బుద్దివంతులు, మొదట విచ్చలవిడిగ సంచరించినను, మార్గములో