పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


గౌరవము పొందెను. “వాఁడు వీఁడని యెంచకపోయిన, నీవు 'అథీనియను'లను బరిపాలించి యుందు'వని యొక రతనితోఁ జెప్ప, "పరులకంటె నా స్నేతులకు హెచ్చుమేలు చేయలేక పోయినపక్షమున నా కీ యుద్యోగమువలన లాభమేమి?”యని థెమిస్టాకిలీసు జవాబుచెప్పెను. ఆరిస్టైడీసు మాత్ర మటులగాదు. వారు వీరని విచక్షణ చేయక, న్యాయముప్రకార వ్యవహారములను విమర్శించుచుండెను. స్నేహితులకు కోపము వచ్చు నేమోయని వారి యన్యాయములను న్యాయము లని యతఁడు తీర్పుచెప్పుట లేదు; అయినను, వారి మాటను త్రోసి వేయుట లేదు. వారి మాట లెంతవఱకు గ్రాహ్యములో, యంతవఱకు వానిని విని యతఁడు వారిని సంతోష పెట్టుచుండెను. ముందు వెనుక లాలోచించక, ప్రజలకు మేలుకలుగునని, థెమిస్టాకిలీసు సభలోఁ గొన్ని యంశములను బ్రసంగించు చుండెను. వానిని 'ఆరిస్టైడీసు' ఖండించుట గలదు. వీ రిరువు రొకప్పుడైనను మిత్రభావమున నుండలేదు; వీరికి ఎప్పుడు షష్ఠాష్టకమె; “మమ్ముల నిరువురిని సముద్రములోఁ బడద్రోసినగాని, అథీనియనుల వ్యవహారములు చక్కఁబడ”వని ఆరిస్టైడీను ముచ్చటించెను. రాజ్యతంత్రములను నడిపించు సమయమున నొకప్పుడు జయము, నొకప్పు డపజయము కలుగును. ఈ జయాప జయములలో నతఁడు మనస్సును కుదురుగ నుంచుకొని న్యాయము విచారించెను; బిరుదులు బొందవలెనను యభిలాష లేదు;