పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరిస్టైడీసు

'ఆరిస్టైడీసు' బీదవాఁడని కొందఱు, కాఁడని కొందఱు చెప్పుదురు. అయిన నతఁడు గొంత స్థితిగలవాఁడని చెప్పవచ్చును. 'ఆథెన్సు'పట్టణములోఁ బ్రజారాజ్యమును స్థాపించిన 'క్లీస్తనీసు'తో నతనికి స్నేహముకలదు. స్పార్టనులలో ధర్మశాస్త్రవేత్తయైన 'లైకర్గసు' నతఁడు వినయముతో గారవించుచుండెను.

ఆరిస్టైడీసు సామంతుల పక్షములోనివాఁడు; థెమిస్టాకిలీసు సంసారుల కక్షలోనివాఁడు. అందుచేత వీ రిరువురికి సహజ శత్రుత్వము. విద్యార్థులుగ నుండు కాలము మొదలు వీరు వైరముగలవారు. ఆటపాటలలో నెగాక, వా రాలోచనాంశములలో భేదించిరి. ఆరిస్టైడీసు శాంతుఁడు; సాత్వికుఁడు; దూరదర్శి; హాస్యములోనైన బొంకులులేనివాఁడు; గంభీరుఁడు; స్థిరుఁడు; ధార్మికుఁడు. థెమిస్టాకిలీసు తొందరపాటుకుఁ దోడు చలచిత్తముకలవాఁడు; చురుకు, నేర్పరి, కార్యములలోఁ దెగించువాఁడు. సరసమైనవాఁడు గనుక నె విశేషముగ స్నేహితులను జాగ్రత్తచేసి, తద్వారా ప్రజారంజకుఁడై

175