పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


స్వదేశ స్వాతంత్ర్యమును బోఁగొట్టఁదలఁచినాఁడని యెంచి, అథీనియను లతనికి మరణదండన విధించిరి. ఆ సంగతి తెలిసి, నిర్దోషి గనుక, అతఁడు పారసీక దేశమునకుఁ బారిపోయెను. క్షారునికుమారుఁడు 'ఆర్తక్షారుఁడు' చక్రవర్తియయ్యెను. ఇతనిని థెమిస్టాకిలీసు శరణువేఁడెను. చక్రవర్తి యతనిని మన్నించి గౌరవించెను. థెమిస్టాకిలీసు పారసీకమున నుండిపోయె.

ఇంతలో గ్రీకులకును పారసీకులకును యుద్ధము తటస్థమయ్యెను. గ్రీకులపైకి యుద్ధమునకుఁ బొమ్మని చక్రవర్తి థెమిస్టాకిలీసున కుత్తరువుచేసెను. స్వదేశీయులతోఁ బోరాడుట కిష్టము లేక, విషముత్రాగి, 65 సం|| రముల వయస్సున, క్రీ. పూ. 460 సం॥ రమున నతఁడు స్వర్గస్థుఁడయ్యెను.