పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరిస్టైడీసు

177


ధనముఁ గూడఁ బెట్టవలె నను గోరికయు లేదు. బంధువు లని స్నేహితు లని మార్దవము లేక, శత్రువులని కార్పణ్యము లేక, యతఁడునిష్పక్షపాతముగఁ బ్రజలకు న్యాయమునిచ్చుచుండెను. ఒక సమయమున నతఁ డొక నేరస్థుని నేరస్థుఁ డని నిరూపించిన పైని, వాని వాదము వినకయె, కోర్టువారు వానికి మరణదండన విధించిరి. అప్పుడు వాఁడు తనకు శత్రువైనను, వాని వాదము వినవలసిన దని కోర్టువారి నతఁడు వేఁడెను.

అతఁడు కోశాధ్యక్షుఁడుగ నియమింపఁబడెను. చిఠా లను తనిఖీచేసి చూచినపుడు, పూర్వపు కోశాధ్యక్షులు సొమ్ము నపహరించినటు లతనికిఁ దోఁచెను; అటుల తస్కరించిన వారిలో థెమిస్టాకిలీ సొకఁడు. నేరస్థాపనఁ జేసి, విషయమును విచారణలోనికి ఆరిస్టైడీసు తెచ్చెను. ఇతఁడు స్నేహితులు గలవాఁడు గనుక ఆరిస్టైడీసె సొమ్మపహరించె నని సభలో వాదము జేసి, యతనినె ప్రజలు నిందించునటులఁ జేసెను. అందుల కతఁడు సైరించి, తన చేతిక్రింది యుద్యోగస్థులు స్వంతముకు సర్కారుసొమ్మును వాడుకొనుచున్నను, చూచి చూడనటుల నూరకుండెను. అందుకు వా రతనిని వేనోళ్ల శ్లాఘించి, యతఁడె కోశాధ్యక్షుఁడుగ నుండిస బాగుగ నుండు నని ప్రజలతోఁ జెప్పిరి. వీరు సంతసించి, యతని నా యుద్యోగములో నుంచిరి. అప్పుడు “లంచములు పుచ్చుకొని మీ సొమ్మును దినివేయువారిని విచారణలోనికిఁ దెచ్చినపుడు, నే నన్యా