పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

థెమిస్టాకిలీసు

173


ఱంద రతనినే చూచుచుండిరి. అతఁడు స్పార్టనుల దేశమునకు వెళ్లెను; అక్కడ వారిచేత మర్యాదలను బొందెను. పరమోచ్చపదవి నతఁ డధిష్ఠించెను.

"గ్రీకులంద ఱథీనియనులు చెప్పినమాటను గౌరవింతురు. అథీనియనులు నా మాటను మన్నింతురు. నేను నా భార్యమాట వినుచున్నాను. నా భార్య నా కుమారుని మాట విను”నని యతఁడు హాస్యముగఁ జెప్పును,

ఒక సమయమున, నిరువురు నాగరకులువచ్చి, యతని కూఁతురు నిమ్మని వేరు వేరుగ నడిగిరి. వారిలో నొకఁడు బుద్ధిమంతుఁడు; మఱియొకఁడు ధనవంతుఁడు. "ధనములేని ఫురుషునికే, నా కూఁతు నిచ్చి వివాహము చేసెదగాని, ధనము కలవాఁడైనను పురుషుఁడు కానివాని కియ్యనొల్ల'నని యతఁడు చెప్పెను.

ఆ థెన్సుపట్టణమున కతఁడు చుట్టు పరిఘను కట్టించెను. పట్టణమునుండి రేవుకు పోవువఱ కిరువైపులను పెద్దగోడలను కట్టించెను. శత్రువుల దాడికి భయపడి, గ్రీకులంద ఱొక సంఘముగఁ గూడిరి. అందులో నథీనియనులు నాయకులుగ నుండిరి. ఆ థెన్సును ఇంత గొప్పపదవిలోనికిఁ దెచ్చిన థెమిస్టాకిలీసును ఆ పట్టణపౌరులు చిన్ననేరము మోపి దేశభ్రష్టునిఁ జేసిరి.

అతఁడు దేశము విడిచిపోయెను. అతఁడు లేనిసమయమున, పూర్వము జరిగిన యుద్ధములోఁ బారసీకులతో, గలిసి