పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

థెమిస్టాకిలీసు

ఆథెన్సుపట్టణములో, థెమిస్టాకిలీసుయొక్క వంశీకులంతగఁ బేరుకెక్కినవారుగారు, అతని మాతాపితృవంశములలో నట్టివాఁ డొకఁ డైనను లేఁడు; తలిదండ్రు, లవియు, సామాన్యస్థితిగతులే.

బాలుఁడుగనున్న దినములలో నతఁ డేపనిచేయుటకు వెనుకతీయ లేదు; మహా చొరవరి; పెద్దపనులను జేయుటకు యత్నించెను. ఇతర బాలురవలె కాలము నాటపాటలలో వ్యర్థ పుచ్చక, పాఠములను జదువుటయందో, ప్రసంగించుటయందో సెలవుదినముల నతఁడు గడిపెను. “అబ్బాయి, నీవు సామాన్యుఁడవుకావు. నీవలనఁ బ్రజలకు శుభమైన నశుభమైన కలుగు”నని యుపాధ్యాయుఁ డనెను. సాహిత్యజ్ఞాన మతనికి గష్టముమీఁదఁ గలిగెను; రాజనీతిశాస్త్రమును ధారాళముగ నతఁడు జదివెను. అందులో నతని యీడుకు మించిన బుద్ధికుశలతను గనఁబఱిచెను.

మొదట థెమిస్టాకిలీసు విచ్చలవిడిగ సంచరించెను; నడవడిలో నిలుకడచూపలేదు; అతని గుణములు విపరీతములు; అవియైనను కేవలము మంచి వని కేవలము చెడ్డ వని చెప్ప

166