పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

థెమిస్టాకిలీసు

167


రాదు. అతఁడు శృంగారపురుషుఁడు; కొంతకాలము విషయ భోగములలో గడిపెను. అతని దుర్వ్యాపారములను జూచి, తల్లి యాత్మహత్యఁ జేసికొన బూనెను; తండ్రి, కోపగించెను. "దుష్టాశ్వములు మొదట వెఱ్ఱిగ తిరిగినను, శిక్ష చేసి కళ్లెములు తగిలించినపైని, మార్గములోనికి వచ్చి సాధువు లగు"నని థెమిస్టాకిలీసు చెప్పుచుండెను. ప్రజారాజ్యములోని 'ఆథెన్సు' పట్టణములో నుద్యోగముఁజేసి కీర్తిప్రతిష్ఠలను బొందవలె నని యతఁడు వాంఛగలవాఁ డాయెను. ఏవిధముననైన, నేకార్యమైనఁ జేసి, పెద్దల దృష్టిలోఁ బడవలె నని యతని కోరిక. అంతియగాని, యతఁడు ముందువెనుక లోలోచించక వ్యవహారములలో దిగుచుండెను. అందుచేత, నతనికి 'ఆరిస్టైడీసు'నకు పరస్పరవైరము కలిగెను. ఇతఁడు దూరదర్శి; శాంతుఁడు; వ్యవహారములలో తొందరపాటులేనివాఁడు. అతఁడు బ్రజలను బెద్దపనులకు బురికొలుపును; ఇతఁడు వారిని శక్తికి తగిన పనులకు నియోగించు. థెమిస్టాకిలీసు చిన్నతనములో 'రాధాను' యుద్ధముజరిగెను. స్వబలపరాక్రమములు చూపించుట కవకాశము లేకపోయె నని యతఁడు చింతించెను. ఈ యుద్ధము 'పారసీకు'లకును "అథీనియను”లకును జరిగెను; అందులో పౌరసీకు లోడిపోయిరి. మున్ముందుకు వారితో పెద్దయుద్దములు జరప వలసియుండునని యతఁ డూహించెను. పూర్వాచారము ప్రకారము 'అథీనియనులు' వెండిగనులు త్రవ్వి, వెండిని తెచ్చుకొని,