పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


ద్వము లన్నియు నడచుచుండును. పిచ్చివాఁడు గనుక, అతఁడు వివాహ మాడలేదు.

అథీనియనులు 'మగారాసెనియనుల'తోఁ బోరాడి వారిని జయించలేక విసిగిపోయిరి. వారితో యుద్ధముఁ జేయ వలసిన దని యెవరైనతమతోఁ జెప్పిన, వారు వానిని దండించుచుండిరి. ఆ సంగతి సోలను తెలిసికొని, వారికి బుద్ధిఁజెప్పవలె నని యెంచి, వెఱ్ఱి వానివలె నటించెను. మార్కట్టునకుఁ బోయి, యక్కడ వెఱ్ఱిచేష్టలు చేయుచు, శత్రువులను జయింఛలేక పోయినందున, నతఁడు 'అథీనియను'లను దూషించెను. వారందఱు తెలివిదెచ్చుకొని శత్రువులపైకి దండెత్తిపోయి, వారిని జయించిరి.

అనంతరము నగరములో రాజ్యాంగములు బాగుగ జరుగుట లేదు. ప్రజలు క్షోభపడుచుండిరి. రాజ్యసూత్రములను ధరించినవా రాత్మపోషణకు ధనమును స్వీకరించుటయే గాని, మనుజుల కష్టములను నివారించుటలేదు. వ్యవహారములు మాటుమణిగెను. వానిని ఋజుమార్గములోఁ బెట్టవలసినదని వా రతనిని వేఁడిరి; 'ఆర్కను' యుద్యోగమిచ్చిరి. కొందఱు ప్రజారాజ్యమున కియ్యకొనిరి; కొందఱు సామంతుల ప్రభుత్వము మంచిదనిరి; మఱికొంద ఱీ రెండు ప్రభుత్వములను సమ్మేళనఁ జేసిన బాగుగనుండు నని యెంచిరి. అన్ని సంగతులను నెమ్మదిగ వితర్కించి, యతఁడు రాజ్యాంగములను మార్చి