పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సోలను

145


వచ్చి పదిరోజు లయినది” యని యజమానునితోఁ జెప్పెను. "ఆ పట్టణములోని విశేషము లేమి?" యని సోల నడిగెను. "ఒక గొప్పవాని కుమారుఁడు చనిపోయెను." "ఎవని కుమారుఁడు?" "జ్ఞాపకము లేదు.” "సోలనుని కుమారుఁడా యేమి?“ "అవును. అవును.” ఆ మాట విని యతఁడు నెత్తి నోరు గొట్టుకొని యేడ్వసాగెను. “నీవంటి మహాత్ముఁడె మనోధైర్యము లేక బాధపడినపుడు, నావంటి దీనులమాటఁ జెప్పనేల? అందుచేత, నేను వివాహమాడలేదు. పరిచారకుని మాటలు సత్యము కావు. నీ కుమారుఁడు చనిపోలే"దని థాలీసు నమ్రతతో జవాబు చెప్పెను.

“సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం." అనునటుల సుఖదుఃఖములు మారుచుండును. విషయభోగముల ననుభవించుటచేత మనస్సునకు గలుగు తుష్టియే సుఖముకాదు. మనోవ్యాపారముల నరికట్టి నిర్మలముగ నుండుటయే సుఖము. సుఖమునకు తగినంత దుఃఖ మున్నది. యతికి బ్రతి యుండనేయున్నది. అటు లని లౌకికవ్యాపారములను మనము మానివేయఁగలమా? లోకములో నున్నంతవఱకు, పులుసు కారము మొదలగువానిని దినుచున్నంతవఱుకు మన మే వ్యాపారమును మానలేము. ధూమశకటముమీఁది ప్రయాణము ప్రమాదమే. అటులనే, పొగయోడ. వీనిమీఁద ప్రయాణముచేయుట మానివేయఁగలమా? తూచినటుల, ద్వం