పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


రాజ్యాధిపత్యమును స్థాపించుటకు దగిన సన్నాహముల నతఁడు చేసెను. నూతనసీమకుఁ బ్రజలను బంపుటకు సేద్యము లేని భూముల నరికట్టించుటకు సీౙరు యత్నించి పాంపేయుని సలహాతో సెనేటుసభలోఁ బ్రస్తావించెను. ఇందుకుఁ బ్రజలు సంతసించిరి.

సీౙరునం దభిమానము పాంపేయునికి లావయ్యెను. వా రిరువు రది నొకటేమాట. మాటలలోనె గాక క్రియలలోఁ గూడ వా రేకీభవించిరి. సర్వసేనాధిపత్యమును వహించుట చేతఁ బూనిన కార్యములను వారు నిరంకుశముగ నెరవేర్చిరి. సీౙరుయొక్క కుమార్తె 'జూలియా'ను పాంపేయుఁడు వివాహమాడెను.

సీౙరు, పాంపేయుఁడు క్రాసస్సు వీరు మువ్వురు రాజ్యమును మూఁడు భాగములుగఁ బంచుకొనిరి. వారి వారి రాజ్యములకు మిగిలినవారు పోయి వ్యవహారములను జూచుకొను చుcడిరి గాని పాంపేయుఁడు స్వరాజ్యమునకు వెళ్లక రోము నగరములోనుండి నూతనముగఁ గాపురమునకు వచ్చిన భార్యతోఁ గాలముఁ గడుపుచుండెను. ఒక వేళ నతఁడు గజములను బోరాడించును; మల్లులయుద్ధముఁ జూచును; నాటకములఁ జూడఁబోవును. ఈ మొదలగు వినోదములలో నతఁడు భార్యతో గలిసి విహరించెను. దంపతు లిరువురుఁ గలిసి 'ఇటలీ' దేశములోని నగరములను జూచుచు యాత్ర జేసిరి. కొంత