పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాంపేయుఁడు

101


పాంపేయుఁడు దేశములోనికి వచ్చి దళములు విడివడుట కుత్తరువు చేసెను. వీరజయోత్సవమునకు రాజధానికి రావలసినదని వారితో నతఁడు చెప్పెను. వారి వారి స్థానములకు వారినిఁ బొండని సెలవిచ్చి పంపివేసెను. ఆనంతర మతఁడు స్నేహితులతోను పరివారజనముతోను గూడి నగరమునకు వచ్చుచుండెను: ఈ వార్తను విని నగరములలోని ప్రజలు సంతసించి గుంపులు గుంపులుగ నతనివెంట నంటి రాజధానికి వచ్చిరి. 'సెనేటు'సభను తిరుగఁద్రోసి మహారాజ్యధిపత్యమును స్థాపించుట కతనికి సమయము దొరికెను. కాని యతఁ డందులకుఁ బూనుకొనలేదు, అతఁడు దిగ్విజయము చేసి వచ్చిన తరువాత చేసిన యుత్సవములలో నిది మూఁడవ వీరజయోత్సవము. అతఁడు దేశములు కొట్టితెచ్చిన ధనము రాసులుపోసిరి. స్వాధీనమైన దేశములనుండి 21,000 టాలంటులు (1 టాలంటు=193 కాసులు: 1 కాసు=15 రూప్యములు) రాఁబడి వచ్చెను. పంచాశ్వములు, భద్రగజములకు పరిమితి లేదు. పరాజిత రాజుల ప్రతినిధులనుగూడ నతఁడు వెంటదెచ్చెను. ఈ యుత్సవము రెండురోజులు రోమునగరములో జరిగెను. -

ఇంతలో బాలసూర్యునివలె సీౙ రుదయించెను. క్రాసస్సు పాంపేయులకుఁ గల మత్సరములఁ బాపి వారిని సఖులుగఁ జేసి వారితో నతఁడు గలిసెను. ఈ మువ్వు రేకీభవించి రాజ్యమేలుటవలన సీౙరు లాభమునుబొంది క్రమముగ నేక