పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాంపేయుఁడు

103


కాలమున కామె గర్భిణియై, యకాలములో నొక స్త్రీశిశువును గని పురిటిచావుఁ జచ్చెను. ఆ శిశువుకూడ విశేషకాలము జీవించలేదు. తదనంతరము పార్థులతో యుద్ధముఁ జేయుచు చనిపోయిన కుమార క్రాసస్సుయొక్క భార్యను పాంపేయుఁడు వివాహమాడెను. ఆమె చక్కనిది. చక్కదనమునకుఁ దోడుగ నామె వీణవాయించఁ గలది; బీజగణితములో నామెకు ప్రవేశముండెను; తత్వజ్ఞానమును "లెస్సగగుఱ్తెఱిఁగియుండెను. ఇన్ని విద్య లున్నను నామె భర్తకు శుశ్రూషఁ జేయుచు మెలకువతో సంచరించెను. స్త్రీలు విద్యనేర్చిన, వినయవిధేయతలు లేక యమంగళకార్యములు సేయుదు రను మాట కామె వికృతముగ నడిచెను.

ఇంతలో పాంపేయుఁడు 'నేపిల్సు' పట్టణములో చావు సంకటముపడి దైవకృపవలన స్వాస్థ్యము నొందెను. అతఁడు మృత్యువువాతఁబడి లేచినందుకు పట్టణములలోను పల్లెలలోను దేశమంతటఁ బ్రజలు మహోత్సవముఁ జేసి యతనిని దర్శించుటకు వేనవేలుగ వచ్చిరి. ఈ మర్యాదలను బొందుటచేత నతనికి గర్వ మంకురించెను. ఇంతకుపూర్వము వినయ విధేయతగ నున్న పాంపేయునకు దర్పము బలిసి సీౙరును నిర్లక్ష్యముగఁ జూడనారంభించెను. "అతఁడు పక్షివంటివాఁడు. ఇతనిఁ బడఁద్రోయుట నిముషముపని” యని పాంపేయుఁడు ప్రగల్భములు పలికెను. ఈ మాటలమూలమున నతనికి