పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాంపేయుఁడు

93


డెను. శత్రువు లతని స్నేహితుని వశముఁ జేసికొని, స్కంధావారములో నతఁడు నిద్రించునపు డతనినిఁ బొడిచి చంపుమని స్నేహితునిఁ బ్రోత్సాహపఱచిరి. ఈ సంగతి భోజనకాలమం దతనికిఁ దెలిసినను పాంపేయుఁడు యధావిధిగ స్నేహితునితోఁ గలిసి భుజించి యతనినిఁ బంపివేసెను. అతఁ డా రాత్రి, శిబిరములోఁ బండుకొనలేదు. స్నేహితుఁడు నిశాసమయమున శిబిరములోనికిఁ బోయి యతఁడుఁ బండుకొనినాఁడని భావించి, కత్తితో నతని మంచముమీడ నాలు గైదు స్థలములలో గంట్లు పెట్టెను. తదుపరి, సైనికులందఱు కలహించి సేనాధిపతియైన స్ట్రాబుని చంపుటకు యత్నించిరి. ధైర్యముఁ గలిగి పాంపేయుఁడు వారి నివారించెను. కొందఱుమాత్రము శత్రుపక్షములోనికి వెళ్లిరి.

ఇంతలో స్ట్రాబుఁడు గతించెను. ఇతఁడు ప్రజలయొద్ద నపహరించిన సొత్తు పాంపేయుని యధీనములో నున్నదని ప్రజ లొక వదంతి వేసి, యతనిని, న్యాయసభలో విచారణకుఁ దెచ్చిరి. స్వదేశమునకు వచ్చులోపున శత్రువు లతని గృహములోఁ బ్రవేశించి ధనము నపహరించిరి. అప్పు డతఁడు న్యాయసభలో ప్రాడ్వివాకుని (Proctor) యెదుట సపక్షమున న్యాయముగఁ బలికినందున నితఁ డందులకు సంతసించి తన కుమారితె నతని కిచ్చి వివాహముఁ జేయుటకు సమకట్టెను. ఈ సంబంధమునకుఁ బ్రజలు సంతసించిరి. అతఁడు